Jagapathi Babu : సంధ్య తొక్కిసలాట ఘటనపై జగపతి బాబు వీడియో వైరల్

Update: 2024-12-23 12:30 GMT

సంధ్య థియేటర్‌ ఘటనకు సంబంధించి.. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు బయటకొస్తున్నారు. బాధిత కుటుంబాన్ని సినిమా వాళ్లు పరామర్శించట్లేదంటూ వస్తున్న విమర్శలపై జగపతి బాబు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశారు. కానీ ఈ విషయాన్ని తానెక్కడ పబ్లిసిటీ చేసుకోలేదని వివరించారు. సినిమా షూటింగ్‌ ముగించుకుని ఊరి నుంచి రాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లానని తెలిపారు. చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లానని చెప్పారు. అందరి ఆశీస్సులతో త్వరగానే బాలుడు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చానని తెలిపారు.

Tags:    

Similar News