సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. అప్రాన్ లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు. డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రోగి సహాయకుడు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.