బీసీ బిల్లుపై 72గంటల దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే ఈ దీక్ష చేయనున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఢిల్లీలో తలపెట్టిన ధర్నా బీహార్ ఎన్నికల కోసమేనని ఆరోపించారు. బీజేపీ నేతలు బీసీలను మోసం చేస్తున్నారని.. బిల్లుపై తప్పించుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు.