BRS: 250 వాహనాల భారీ కాన్వాయ్‌తో షోలాపూర్ వెళ్లనున్న కేసీఆర్
మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనకు 250 వాహనాల భారీ కాన్వాయ్‌తో గులాబీ బాస్ వెళ్లనున్నారు.
మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.కాసేపట్లో ప్రగతిభవన్‌లో ప్రజాప్రతినిధులతో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం తరువాత భారీ కాన్వాయ్‌తో షోలాపూర్ వెళ్లనున్నారు. దాదాపు 250 వాహనాల భారీ కాన్వాయ్‌తో గులాబీ బాస్ వెళ్లనున్నారు. ఆయన తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మహారాష్ట్ర కు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి షోలాపూర్‌లో బసచేయనున్నారు. రేపు పండరీపూర్ విఠలేశ్వరుడి దర్శనం చేసుకోనున్నారు. తిరుగుప్రయాణంలో తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకోనున్నారు కేసీఆర్.
ఇక తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలను కలిసే అవకాశం ఉన్నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరికల కార్యక్రమం జరగనుంది.. సోలాపూర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.