TG : రైల్ రోకో పిలుపు ఇవ్వలేదంటూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్

Update: 2024-06-25 05:13 GMT

మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ( KCR ) సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రైలు రోకో కేసులో తనకు సంబంధం లేకపోయినా తనపై కేసు నమోదు చేశారని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. ప్రజా ప్రతినిధుల కోర్టులోని కేసును కొట్టేయాలంటూ పిటిషన్లో కేసీఆర్ కోరారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని పోలీసులు నివేదిక అందజేశారు. 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో కేసీఆర్ రైల్ రోకోకు పిలుపునిచ్చారని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు రోకో వల్ల రైలు రాకపోకలు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. అయితే తాను ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్ లో కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారని కేసీఆర్ పిటిషన్లో తెలిపారు.

రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ ఈ సందర్భంగా పిటిషన్లో పేర్కొన్నారు. అసలు రైల్ రోకో కేసుకు తనకు ఎలాంటి బలం లేదని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ లో వివరించారు.

Tags:    

Similar News