KCR : ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ గణపతి హోమం

Update: 2025-09-06 15:30 GMT

మాజీ సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గణపతి హోమం చేయిస్తున్నారు. తన సతీమణి శోభతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ 5 రోజులుగా ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. అటు హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. నేరుగా ఫామ్‌హౌస్‌కు వెళ్లి కవిత ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది. కాగా గత ఎన్నికల్లో ఓటమి నుంచి అనేక సమస్యలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. తొలి ఏడాది కవిత జైలు, కేటీఆర్ ఫార్ములా కేసులు పార్టీని ఇబ్బందిపెట్టాయి. రెండో ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరక నేరుగా కేసీఆర్-హరీష్‌రావును తాకాయి. రాజకీయంగా దాన్ని డైవర్ట్ చేయాలని భావించారు. కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత... గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై, నాయకులపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే కవిత తన ఆరోపణలను మరింత తీవ్రతరం చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖను తెలంగాణ భవన్‌కు పంపారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా లేఖ రాశారు

Tags:    

Similar News