ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన టర్న్ తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు హైకోర్టు ధర్మాసనం ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా లక్ష రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు, పాస్‌పోర్టులను కూడా హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు కోర్టు స్పష్టం చేసింది.