Konda Surekha : తిరుమలలో రేవంత్ పాలనపై కొండా సురేఖ కామెంట్స్

Update: 2024-10-29 11:45 GMT

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కొండా సురేఖ. తిరుమల శ్రీవారిని ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మనమడి పుట్టి వెంట్రుకలు ఇచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కొండా సురేఖ తెలిపారు.  

Tags:    

Similar News