KTR: మోదీ తెలంగాణకు ప్రధాని కాదా ?.. కేవలం గుజరాత్‌కేనా..!: కేటీఆర్
KTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్.
KTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం  సవతి తల్లిప్రేమ ప్రదర్శిస్తుందని ఆరోపించారు.  ఎన్నిలేఖలు రాసినా.. బడ్జెట్‌లో ఒక్కటికూడా  కెటాయించకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ తెలంగాణకు ప్రధాని కాదా.. కేవలం గుజరాత్‌కేనా అని ప్రశ్నించారు.  తెలంగాణ దేశంలో లేదా అన్నారు.  మనం పన్నుల రూపంలో కడుతున్న డబ్బుతో.. యూపీ, బీహర్‌లలో అభివృద్ధి  చేస్తున్నారన్నారు. విద్యాసంస్థల కెటాయింపులోను  తెలంగాణకు తీవ్ర అన్యాయం  జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు.