కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. అదానీ వ్యవహారంలో ప్రజలకు సమాధానం చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అదానీపై పోరాటం చేస్తోందా? లేక ప్రజలను మోసం చేస్తోందా? అని ప్రశ్నించారు. అదానీతో పోరాటం అని ఢిల్లీలో మీరు అంటుంటే, తెలంగాణ ప్రభుత్వం దోస్తీ చేస్తోందని ఆరోపించారు.
కేటీఆర్ తన లేఖలో.. అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టారు. ఒకవైపు మీరు అదానీని అవినీతికి చిహ్నంగా పేర్కొంటున్నారు. అతను మోదీ ‘క్రోనీ క్యాపిటలిస్ట్’ అని అంటున్నారు. మరోవైపు అదే అదానీని తెలంగాణలోని మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు కౌగిలించుకుంటున్నారు. అసలు అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటో తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా.. లేక ప్రజలను మోసం చేస్తున్నారా అనే విషయంపై స్పష్టం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో అదానీతో పోరాటం అంటూ తెలంగాణ ప్రభుత్వం దోస్తీ చేస్తోందని కేటీఆర్ ప్రస్తావించారు