Maharashtra: మంగళహారతులతో కేసీఆర్‌కు గ్రాండ్ వెల్‌కమ్

భారీ కాన్వాయ్‌తో సోలాపూర్‌ చేరుకున్న కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు మహిళలు, బీఆర్‌ఎస్ శ్రేణులు.

Update: 2023-06-27 01:45 GMT

సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలో రెండో రోజు పర్యటిస్తున్నారు. భారీ కాన్వాయ్‌తో సోలాపూర్‌ చేరుకున్న కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు మహిళలు, బీఆర్‌ఎస్ శ్రేణులు. డప్పు చప్పులు, మంగళహారతులతో మహరాష్ట్ర ప్రజలు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.సోలాపూర్‌ లోనే బస చేసిన కేసీఆర్‌ ఇవాళ పండరీపురంలోని విఠోభారుక్మిణి మందిర్‌ను సందర్శించనున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభలోనే సోలాపూర్‌ జిల్లాలో ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు. ఈ పర్యటనలో కేసీఆర్‌ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Tags:    

Similar News