TG : ఇందిరా స్ఫూర్తితో మహిళా శక్తి భవనాలు.. కొండా సురేఖ నివాళులు

Update: 2024-11-19 11:30 GMT

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. వరంగల్‌ జిల్లా కాశీబుగ్గలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతోనే నేడు దేశం అగ్రపథాన కొనసాగుతున్నదన్నారు. ఇందిరా గాంధీ ఆశయాల మేరకు మహిళలను స్వయం సాధికారత కలిగిన శక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి సురేఖ తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని తెలిపారు. ఇందిరమ్మ జయంతి రోజునే 22 జిల్లాల్లో నూతనంగా నిర్మించబోయే ఇందిర మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ లో భూమిపూజ చేస్తున్నారు.  

Tags:    

Similar News