తెలంగాణలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక హీట్ నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం ఆశావాహులు భారీగా పోటీపడుతున్నారు. దీంతో ఎవరికీ టికెట్ దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందని చెప్పారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారని.. అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై సర్వే జరుగుతోందని తెలిపారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారన్నారు. జూబ్లీహిల్స్‌లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు