Konda Surekha : మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: నాగబాబు

Update: 2024-10-03 08:55 GMT

మంత్రి స్థాయిలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సంస్కారహీనం అవుతుందని నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. ‘స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. నాగార్జున కుటుంబానికి, సమంతకు, చిత్రసీమకు నేను అండగా నిలబడతాను’ అని ట్వీట్ చేశారు.

మంత్రి కొండా సురేఖ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ‘ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. నేను రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. 365 రోజులూ సమంతను దగ్గరుండి చూశా. ఒక అభిమానిగా చెప్తున్నా ఆమె తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం. ఆమె ఆర్టిస్ట్‌గా కాదు.. ఇంట్లో అక్కలా అనిపించేవారు. సురేఖ గారు మాట్లాడింది తప్పు’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News