రైతు భరోసా విధి విధానాల్లో భాగంగా శుక్రవారం వనపర్తిలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటించనుంది. వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీవోసీ)లో నిర్వహించనున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యశాల (వర్క్ షాప్) లో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, డిప్యూటీ సీయం మల్లు భట్టివిక్రమార్క, సభ్యులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్ట్ హోదాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతో పాటు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు. రైతు భరోసా విధివిధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరించనుంది.