కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలనే కుట్రలను తిప్పికొడుదామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ.. కార్మిక సంఘాలు, వివిధ సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్ధతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. కార్మికులకు అండగా ఉంటామని.. కేంద్రంపై పోరాడుతామని స్పష్టం చేశారు. మరోవైపు దేశవ్యాప్త సమ్మె కొనసాగుతోంది.పలు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ సహా రవాణా వ్యవస్త స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.