తెలంగాణ రాష్ట్రంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ మహానగరం ఫార్మా, ఐటీ, రియల్ ఎస్టేట్ లాంటి పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలకు నిలయంగా ఉండటంతో ఇక్కడ మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. లక్ష లాది మంది కార్మికులు ఉద్యోగులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నారు. దాదాపు 20 లక్షల మంది యువత అటు ఫార్మా, ఇటు రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలల్లో పని చేస్తుంటారు. దీంతో ఇక్కడ మద్యం విక్రయాలు అధికం. రాష్ట్రంలో మద్యం కంటే అత్యధికంగా బీర్లు అమ్ముడుపోతున్నట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతీ ఐదుగురు మద్యం ప్రియుల్లో కనీసం ముగ్గురు బీరు తాగేవారు ఉన్నారు. కింగ్ ఫిషర్ అల్ట్రా విట్ బీర్ రూ.320 రూపాయలు ఉండగా తాజా పెంపుతో రూ. 48 పెరగనుంది. కరోనా బీరు ధర రూ.230 ఉండగా, ప్రస్తుతం 264కు చేరింది.