తెలంగాణ ప్రజలెవ్వరూ LRS కట్టొద్దన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల కాంగ్రెస్ నేతలు నిరసనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా ప్లాట్లను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో దోచుకుంటోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వానికి 3లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందన్నారు. తప్పుడు లేఅవుట్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎలాంటి పెనాల్టీ లేకుండా ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని పిటిషన్ వేశామని.. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.