Revanth Reddy : ట్రాఫిక్ చలాన్ల మీద కొత్త రచ్చ..

Update: 2026-01-15 06:00 GMT

ఇప్పుడు తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల మీద కొత్త రచ్చ మొదలైంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ చలాన్ ల మీద ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. అవసరమైతే ఇక నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు అకౌంట్లను లింకు చేసుకోవాలని.. ట్రాఫిక్ చలాన్లను ఎప్పటికప్పుడు వారి బ్యాంకు అకౌంట్లో నుంచి కట్ చేసుకోవాలి అంటూ చెప్పారు. ఈ కామెంట్ల మీద విపరీతమైన రచ్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి సిస్టం ఏ రాష్ట్రంలోనూ పెద్దగా లేదు. ప్రజల బ్యాంకు అకౌంట్లు ప్రభుత్వానికి ఇవ్వడం అంటే ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. దీని మీద సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. రూల్స్ కేవలం ప్రజలకేనా.. రోడ్లు సరిగా లేకపోతే ప్రభుత్వాలు కూడా తమకు ఫైన్ లు కడతాయా అంటూ కొందరు పోస్టులు పెట్టడం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేయకపోతే వారి అకౌంటు నుంచి కూడా డబ్బులు కట్ అయ్యేలా కొత్త సిస్టం తీసుకురావాలని అంటున్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సరిగ్గా పని చేయకుంటే వారి అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యేలా రూల్స్ తీసుకురావాలని చెబుతున్నారు. రూల్స్ తమకు విధించే ముందు రోడ్లు సరిగ్గా లేకపోయినా.. గుంతలు పడినా ప్రభుత్వాలు తమకు ఎంత పన్ను కడతాయో చెప్పాలి అంటున్నారు. అటు బిజెపి మాత్రం కాంగ్రెస్ ఇలా పన్నులు విధించడం కరెక్ట్ కాదు అంటూ వాదిస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలాంటి ట్రాఫిక్ చలాన్లను పెంచిందే బిజెపి కేంద్ర ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇలా ఎవరికి వారు ట్రాఫిక్ చలాన్ల మీద తమ వాదనలు వినిపిస్తున్నారు. అటు బిఆర్ ఎస్ కూడా ఈ వివాదంలోకి దిగింది. తాము ఎన్నడూ ఇలాంటి విధానాలు తీసుకురాలేదని.. తాగి వాహనాలు నడిపిన వారిని కంట్రోల్ చేసేందుకు మాత్రం చర్యలు తీసుకున్నామని చెబుతుంది. కాంగ్రెస్ నేతలు మాత్రం రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడారు అని.. అలా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ చలాన్లు వసూలు చేస్తే రోల్స్ కరెక్ట్ గా ఫాలో అయి రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి అంటున్నారు.

Tags:    

Similar News