Uttam Kumar Reddy : త్వరలో కొత్త రేషన్ కార్డులు.. సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్
కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy ) వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
కోదాడ, హుజూర్‌నగర్ పరిధిలో ఇంజనీర్ల కొరత ఉందని హుజూర్‌నగర్ పరిధిలో 18 మంది ఏఈలు అవసరం ఉండగా 11 మంది ఉన్నారని, కోదాడ పరిధిలో 16 మందికి 13 మంది ఎఈలు ఉన్నట్లు మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. అందుకు మంత్రి స్పందిస్తూ సిబ్బంది తక్కువగా ఉంటే తీసుకుని పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా యుద్ధప్రాతిపదికన పనిచేసి ఎత్తిపోతల పథకాలను సకాలంలో అందుబాటులోకి తేవాలని మంత్రి అన్నారు.