Jishnu Dev Verma :పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీని వాడాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకొని ప్రజల భద్రతపై దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఇవాళ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ట్రాఫిక్ సమ్మిట్ ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ నిర్వ హణ సాధ్యమన్నారు. ప్రజల భద్రతను కాపాడడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం సమిష్టి కృషి అవసరమన్నారు. మన దేశంలో రహదా రులు వేగంగా విస్తరిస్తున్నాయని, గత దశాబ్దంలోనే 60శాతం వరకు జాతీయ రహదారులు విస్తరించాయన్నారు. ఈ ఆధునిక కనెక్టివిటీలోకి హైదరాబాద్ చేరడం గర్వకారణమన్నారు. నగరాలు వేగంగా విస్తరి స్తుండడంతో ప్రభుత్వం కూడా హైవేలు, రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తోందన్నారు. పోలీసులు ప్రజల భద్రత కోసం టెక్నాలజీని, ఏఐని, కంప్యూటర్ల ను, రోడ్లపై కెమెరాలను, మరింత మంది పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో ప్రపంచంలోని ఉత్తమ పద్ధతులను అమలు చేసేలా ఒక మోడల్ తయారుచేయాలని సూచించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లా డుతూ మొదటి సారిగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్ చేస్తున్నారని, ఇక్కడ నిపుణులు తమ ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శేఖర్రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.