యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన దృష్ట్యా పలువురు బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. సంగెం నుంచి భీమలింగం వరకు సీఎం పాదయాత్ర చేస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా..ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. పాదయాత్ర అనంతరం అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం రేవంత్‌రెడ్డి.