ఖమ్మం మున్నేరు వరద ప్రాంతాలను ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ పరిశీలించారు. బొక్కలగడ్డ, కాల్వాడ్డు ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ముంపు ప్రాంతాలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.
వరద బాధితులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు ప్రొ.కోదండరామ్. ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు వచ్చి బాధితులను ఆడుకోవడం అభినందనీయమన్నారు.