Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: పురందీశ్వరి
అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి తెలిపారు. ‘రాజకీయ నాయకులు దేశానికి, రాష్ట్రానికి సేవ చేస్తే, సినీనటులు ప్రజలకు వినోదం అందిస్తారు. ఇతరులను కించపరచకుండా, వారిని గౌరవిస్తే సముచితంగా ఉంటుంది. సినీ, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తిగా, మహిళగా మంత్రి మాటలను ఖండిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా హీరో వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి స్పందించారు. ‘సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఓ మహిళే తన తోటి మహిళను అవమానించడం సిగ్గుచేటు. ఎందుకు ఎప్పుడూ మమ్మల్నే టార్గెట్ చేస్తారు?’ అని ఫైర్ అయ్యారు. మరోవైపు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యల వల్ల బాధిత మహిళలు తీవ్ర క్షోభ అనుభవిస్తారని చెప్పారు.
మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చూసి షాకయ్యానని ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ‘ప్రతిచోట మహిళలు వివక్ష, అవమానాలను ఎదుర్కొంటున్నారు. కొందరు సంచలనాల కోసం థంబ్‌నైల్స్‌గా వాడుకుంటారు. ఆఫీసర్లనూ వదలరు. నా వ్యక్తిగత అనుభవం ప్రకారం మాట్లాడుతున్నా. ప్రతి అంశాన్ని రాజకీయపరంగా చూడొద్దు’ అని కోరారు.