Rains in Telangana : తెలంగాణలో 3 రోజులు వర్షాలు

Update: 2024-06-10 04:44 GMT

తెలంగాణలో నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఉరుములు, మెరుపులతో పాటు 30-40Kmph వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, YSR, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Tags:    

Similar News