Rains in Telangana : తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు

Update: 2024-05-16 05:39 GMT

తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉదయం ఎండకాసినా, సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని అధికారులు పేర్కొన్నారు. 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.

ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడుతాయని, నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియని వృద్ధుడు (65) వడదెబ్బతో మంగళవారం మృతిచెందినట్టు కాచిగూడ అడ్మిన్‌ ఎస్సై సుభాశ్‌ తెలిపారు.

Tags:    

Similar News