TS : ఎన్నికలు పూర్తి కాగానే రేషన్ కార్డులు

Update: 2024-05-10 08:48 GMT

కాంగ్రెస్ కు 13 సీట్లు ఖాయమన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ కు ఒక్క సీటూ రాదన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే అర్హులకు రేషన్ కార్డులు అందజేస్తామని.. హైకమాండ్ ఆర్డర్స్ తోనే శంకరమ్మను పార్టీలో చేర్చుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరిగిందని.. 13 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని.. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందులోనూ నల్లగొండ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మరోసారి జనాలను మోసం చేసేందుకు రెడీ అయ్యాయని అన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవడం లేదని చెప్పారు ఉత్తమ్. ఎన్నికల పూర్తి కాగానే రాష్ట్రంలోని అర్హు లందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకే పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఇప్పటికే 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిం దని.. హైకమాండ్ ఆదేశాలతో ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శంకరమ్మకు తగిన న్యాయం చేస్తామన్నారు.

Tags:    

Similar News