Munneru Floods : తగ్గిన మున్నేరు వరద ప్రవాహం.. ఇళ్లలో స్థానికుల రోదనలు

Update: 2024-09-02 08:55 GMT

ఖమ్మం మున్నేరు వరద ప్రవాహం తగ్గింది. దీంతో లోతట్టు ప్రాంతాలు వరదనీటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మున్నేరు పరివాహక ప్రాంతాలలో ఉన్న ఇళ్లల్లోకి ప్రజలు చేరుకుంటున్నారు. తమ ఇంట్లోకి వెళ్లి పరిస్థితిని చూసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రూరల్ మండలం రాజీవ్ గృహకల్పను మున్నేరు ముంచెత్తింది. దీంతో నిన్నటి నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు అటు వైపు వెళ్లలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరుణగిరి బ్రిడ్జ్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని ఆవేదన వెలిబుచ్చారు. ముగ్గురు మంత్రులు ఉన్న కనీసం స్పందించడం లేదన్నారు.

Tags:    

Similar News