Telangana High Court : కేసీఆర్ కు ఊరట.. రైల్ రోకో కేసు కొట్టివేసిన హైకోర్టు

Update: 2025-04-04 11:30 GMT

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. ఉద్యమ సమయంలో ఆయనపై నమోదైన రైల్ రోకో కేసును కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్లో రైల్ రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉండగా కేసీఆర్ పిలుపు మేరకు రైల్ రోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే, రైల్ రోకో జరిగిన సమయంలో కేసీఆర్ అక్కడ లేరని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం, కేసీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Tags:    

Similar News