గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాద ఘటన కు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. 17 మందిని బలిగొన్న ప్రమాదానికి కారణాలను కనుగొన్నారు అధికారులు. ఆరుగురు శాఖల ఉన్నతాధికారులతో కమిటీ అగ్నిప్రమాదంపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు తేల్చి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. ఇలా వుండగా ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఉన్న 14 ఏసీల కంప్రెషర్స్ ఒకేసారి పేలటంతో తీవ్రత పెరిగిందని ప్రచారం జరుగుతోంది. సామర్థ్యానికి మించి భారం పడటంతో మీటర్‌లో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడిందని, అది క్రమంగా ఏసీలకు పాకటంతో ఇంతటి దారుణం జరిగి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు గ్యాస్ కారణంగా ప్రమాదం సంభవించిందా అని తెలుసుకునేందుకు ఓఎన్‌జీసీ బృందాన్ని రప్పించనున్నారు.