తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే 10ఏళ్లు నేనే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని.. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’’ అని కోమటిరెడ్డి పోస్టర్ చేశారు. రాజకీయాల్లో ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.