తమ పాలనలో ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్ర రెవెన్యూ పెరిగిందన్నారు. రాష్ట్రానికి రూ.7లక్షల కోట్ల అప్పు ఉందని, దీనిపై వడ్డీ తగ్గించగలిగితే ప్రభుత్వానికి ఏటా రూ.1000 కోట్లు ఆదా అవుతాయని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం వివరించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ నేత KC వేణుగోపాల్‌తో సమావేశయ్యారు. ఇందులో TPCC చీఫ్ అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉంది.
రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తేల్చి చెప్పారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని చెప్పారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.
రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుందని, మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందని సీఎం వివరించారు.