TS : లేడీస్‌కి రూ.2500.. రేవంత్ కీలక నిర్ణయం

Update: 2024-03-12 06:10 GMT

మహాలక్ష్మి స్కీం (Mahalakshmi Scheme) కింద నెలకు రూ.2,500. ఈ స్కీమ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోపే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఎన్నికల ముందు కేబినెట్ సమావేశం జరుగనుండడంతో ఆసక్తికరంగా మారింది.

మంత్రివర్గ సమావేశంలోనే సమావేశంలో మహిళలకు నెలకు రూ. 2500పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కసరత్తు చేస్తున్న సర్కారు.. వందరోజుల్లోపు విధానపరమైన నిర్ణయం ప్రకటించాలని డిసైడైంది. స్వయం సహాయక గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాల పునరుద్దరణ, రూ. 5 లక్షల జీవితబీమాపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగనున్న నేపథ్యంలో ఈ మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహిళలకు నెలకు రూ. 2500 తో పాటు, రేషన్ కార్డులు, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నాయి సంబంధిత వర్గాలు. వందరోజుల్లోపు అన్ని గ్యారంటీలు అమలు చేసిన క్రెడిట్ తీసుకోకపోతే ఇరకాటంలో పడేప్రమాదం ఉండటంతో.. రేవంత్ సర్కారు అలర్ట్ అయింది.

Tags:    

Similar News