హైదరాబాద్‌లో భారీ వర్షానికి పూర్తిగా జలమయమైన రోడ్లు..!
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి.;
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీరు కారణంగా రోడ్లపై కంకరతేలి గుంతలమయం అయ్యాయి. దీనికారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలే అధికారులు గ్రేటర్‌లోని చాలా చోట్ల కొత్తరోడ్లువేశారు. చినుకు పడగానే రోడ్లన్ని గుంతలుగా మారి... మున్నాళ్ల ముచ్చటగా తయారైంది. రోడ్ల మరమ్మత్తుకు ప్రతియేటా 9వందల కోట్లు జీహెచ్‌ఎంసి ఖర్చుచేస్తోంది. నాసిరకం రోడ్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.