Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం ఎక్స్‌గ్రేషియా

Secunderabad Fire Accident: కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.;

Update: 2022-03-23 05:50 GMT

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. కేసీఆర్ మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

బోయిగూడ ఐడీహెచ్ కాలనీలో స్క్రాప్ దుకాణంలో తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో బీహార్ కు చెందిన 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 

Tags:    

Similar News