సంచలనం రేపిన అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.
తమిళనాడుకు చెందిన అప్సర డిగ్రీ పూర్తి చేసింది. నటన, మోడలింగ్‌పై ఆసక్తితో పలు తమిళ చిత్రాల్లో నటించింది. సినిమా అవకాశాల కోసం 2022 ఏప్రిల్ నెలలో హైదరాబాద్‌కు వచ్చింది. తల్లితో కలిసి సరూర్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేది. దైవభక్తి కలిగిన అప్సర తరచూ దేవాలయానికి వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. అప్సరతో పూజారి సాయికృష్ణ నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో నాలుగుసార్లు హత్యకు ప్లాన్ చేశాడు.