TG : బండి సంజయ్ కి సిట్ నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలన్న అధికారులు.

Update: 2025-07-17 09:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో తమ ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు ఆరోపించి ఫిర్యాదు చేసిన నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి.. వారి వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో నేతలు సిట్ అధికారులకు తమ వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చింది సిట్ . ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని తన నోటీసులో పేర్కొంది. మరి బండి సంజయ్.. సిట్ విచారణకు హాజరవుతారా.. లేదా అనేది చూడాలి.

Full View

Tags:    

Similar News