మా నాన్న చేసిన పనికి క్షమించండి: ఎమ్మెల్యే కూతురు

తన తండ్రి అలా చేసి ఉండాల్సింది కాదని,ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉందని తెలిపారు.

Update: 2023-06-25 10:45 GMT

మరో వివాదంలో చిక్కుకున్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. తన పేరుపై ఉన్న 1270 గజాల స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తానని అన్నారు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జాభవాని.స్థలంలో క్షమాపణ కోరుతూ బోర్డు ఏర్పాటు చేశారు ఆమె. తన తండ్రి అలా చేసి ఉండాల్సింది కాదని,ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉందని తెలిపారు. స్థలం విషయంలో తప్పు జరిగింది, తన తండ్రి చేసిన పనికి క్షమించండని కోరారు.కోర్టు ద్వారా స్థలాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తామని అన్నారు.అయితే చేర్యాలలోని పెద్దచెరువు మత్తడి స్థలం కబ్జా చేశారని, స్థలాన్ని కూతురు పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశారని ముత్తిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.ఈ స్థలం కబ్జాపై గతంలో విపక్షాలు ఉద్యమాలు కూడా చేశాయి. తన పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారంటూ ఇటీవల హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముత్తిరెడ్డి కూమార్తె తుల్జాభవాని.

Tags:    

Similar News