Sankranthi 2022 : మకర సంక్రాంతి అంటే ఏంటి.. ఈ రోజు ఏం చేస్తే మంచిది?

Sankranthi 2022 : సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశించడం. సూర్యడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు.

Update: 2022-01-15 01:45 GMT

Sankranthi 2022 : సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశించడం. సూర్యడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఇవాల్టి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. తొలి రోజు భోగిని వైభవంగా చేసుకున్న తెలుగు ప్రజలు.. ఇవాళ సంక్రాంతిని మరింత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు.

ఉత్తరాయణ దేవతలకు ప్రీతికరం. నువ్వుల ధానం, నల్లనువ్వులతో హోమం చేస్తే.. శని ధోషాలు, అకాల మృత్యదోషం నివారణ అవుతుందని నమ్మకం. గుమ్మడిపండును కూడా ధానం ఇస్తారు. మకర సంక్రాంతి రోజైన ఇవాళ... పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృ తర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. కొత్త పంట ధాన్యాన్ని వండి నైవేద్యంగా పితృదేవతలకు పెడతారు.

సంక్రాంతి ప్రధానంగా రైతుల పండుగ కావడంతో.. పల్లెటూరులు సందడిగా మారాయి. పిల్లలు పెద్దలు... కొత్తబట్టలతో ఆకట్టుకుంటున్నారు. ఇక రకరకాల నోరూరించే పిండివంటలు సరేసరి. ముంగిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో మురిసిపోతున్నాయి. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, గాలిపటాల ఎగరేస్తూ పిల్లల కేరింతలు, కోళ్ల, ఎడ్ల పందాలతో ఊరూవాడా సంబరాలు మిన్నంటుతున్నాయి.

పల్లెల్లో... సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడోరోజు కనుమనాడు.. పశువులను పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజును ముక్కనుగా కూడా చేసుకుంటారు.సంక్రాంతిని దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటున్నారు. ఉత్తర భారత్‌లో ఈ పండును మాఘీగా పిలుస్తారు. మధ్యభారతంలో సుకారత్‌ అని, అసోంలో మఘ్‌ బిహూఅని పిలుస్తారు. ఇక తమిళనాడులో.. పొంగల్‌ అని అంటారు. సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన సంక్రాంతిని.. ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

Tags:    

Similar News