దక్షిణ కాశిగా ప్రసిద్ధికెక్కిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సిబ్బంది చేతి వాటం పెరిగిపోతోంది. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో స్వామి వారికి మొక్కు తీర్చుకుంటున్న భక్తులను సిబ్బంది నిలువు దోపిడీ చేస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకలు స్వామి వారి ఖజానాకి చేరకుండా ఆలయ సిబ్బంది తమ జేబులోకి వేసుకుంటున్నారు. ముఖ్యంగా స్వామికి కోడె మొక్కు చెల్లించుకునే భక్తుల నుండి డబ్బులు దండుకుంటున్నారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దీనిపై ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.