Pushpa-2 Sandhya Theater : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్!
‘పుష్ప-2’ ప్రీమియర్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానితోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు అతని టీమ్‌పైనా కేసు నమోదైంది.
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తుందని పేర్కొంది. ‘పుష్ప-2’ టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని – మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150-100 మేర తగ్గాయి. రేపటి నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ సైట్‌లలో తగ్గించిన ధరలు అందుబాటులో ఉన్నాయి. కాగా మూవీకి టికెట్ ధరలు భారీగా పెంచడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.