రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తంగళపల్లి కేసీఆర్ నగర్‌లో రామాలయంలో రాముని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న బీజేపీ ఏబీవీపీ నాయకులు మానేరు బ్రిడ్జిపై నిరసనకు దిగారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాతో బ్రిడ్జికి ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ధర్నా చేస్తున్న బీజేపీ, ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.