TG : క‌ళ‌ల‌ కాణాచి తెలంగాణ‌: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

Update: 2024-07-18 05:45 GMT

తెలంగాణ కళలకు కాణాచిగా ఉంద‌ని, జానపద కళలు, శాస్త్రీయ కళలు,సంగీతం, నృత్యం హైదరాబాద్ దక్కనీ కళారూపాలు ఎన్నో తెలంగాణ లో విలసిల్లుతున్నాయని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ర‌వీంద్ర‌భార‌తీలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నాట్యకారిణి, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్ట‌ర్.పద్మజా రెడ్డి ప్ర‌ద‌ర్శించిన కాకతీయం 3 వ భాగం నృత్య రూప‌క కార్య‌క్ర‌మానికి మంత్రి జూప‌ల్లి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ... కాకతీయులు ఎన్నో సాహిత్య, సాంస్కృతిక, కళా రూపాలను, క‌ళాకారుల‌ను పోషించారని, అందులో పేరిణి నాట్యం కూడా ఒక‌ట‌న్నారు. ఆ క్రమంలోనే డాక్ట‌ర్.పద్మజా రెడ్డి కాకతీయ వైభవాన్ని, కాకతీయుల ఔన్నత్యాన్ని చాటే విధంగా "కాకతీయం " అనే నృత్య రూప‌కాన్ని నాట‌క రూపంలో కాకతీయ కాలంలో రుద్రమదేవి, ఇతర చక్రవర్తులు ఆనాటి కళా సంప్రదాయాలు, రీతులు అన్నీ ఈ నాట్య రూపకంలో అద్భుతంగా కళ్లకు కట్టినట్టుగా చూపించారన, కలలును సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని ప్ర‌శంసించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళలు,సంస్కృతి, సాహిత్యం లో అభివృద్ధి కోసం కృషి చేస్తుంద‌ని, క‌ళాకారును ప్రొత్స‌హిస్తుందని అని తెలిపారు. అందులో భాగంగానే ఇటీవలే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రభుత్వ పరంగా అందజేశామ‌ని వెల్ల‌డించారు.

అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండే అన్ని రకాల జానపద, గిరిజన,శాస్త్రీయ కళాకారులకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News