Telangana Assembly : డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Update: 2024-11-22 06:45 GMT

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఫిక్స్ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి జరగనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావస్తుండగా.. ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి.. రాబోయే కాలంలో చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధం అవుతోంది. అలాగే రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్ధమయ్యాయి.

Tags:    

Similar News