TS: నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్ , మంత్రులు

Update: 2024-02-13 04:42 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం 10:15 గంటలకు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయల్దేరుతారు.

భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్​భూపాలపల్లి జిల్లా అంబట్​పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీకి (medigadda barrage) మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న ఏడో బ్లాక్​లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు. సీఎం, ప్రజాప్రతినిధుల పర్యటనల నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వీఐపీల రాకను పురస్కరించుకుని మేడిగడ్డ పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలు దూరం

మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లడం లేదు. మేడిగడ్డ పర్యటనకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లడం లేదంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు

సీఎం రేవంత్ షెడ్యూల్‌ ఇదే

ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం మేడిగడ్డకు 2గంటలకు రాక

మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు బరాజ్‌ పరిశీలన

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష సమావేశం

4 నుంచి 5గంటల వరకు మీడియా సమావేశం

తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు

Tags:    

Similar News