ఏపీ సీఎంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులపై లేనిపోని ఆరోపణలతో ప్రధాని మోదీకి లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సర్వేల పేరుతో ఏకంగా పనులు పూర్తి చేస్తూ... NGT, KRMB తో పాటు కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత పేరుతో కేసీఆర్ స్నేహ హస్తాన్ని అందిస్తే... జగన్ నమ్మక ద్రోహం చేస్తున్నారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.