మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ తలపెట్టిన గిరిజన మహాధర్నాకు హైకోర్టు అనుమతించింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గిరిజన మహాధర్నా చేసుకోవచ్చని తెలిపింది. వాస్తవానికి గురువారం మహబూబాబాద్‌లో మహా ధర్నాను బీఆర్ఎస్ నేతలు నిర్వహించాలని భావించారు. అయితే అందుకు పోలీసులు అనుమతివ్వలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ… బుధవారం రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహబూబాబాద్ సీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయినా పోలీసుల నుంచి అనుమతులు రాకపోవడంతో గురువారం తలపెట్టిన ధర్నాను వాయిదా వేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.