TG High Court : కనీవినీ ఎరుగని తీర్పు.. కోర్టును తప్పుదోవ పట్టించారని కోటి జరిమానా
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు కోటి రూపాయలు జరిమానా విధించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచి.. వేరే బెంచ్ వద్ద పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై జస్టిస్ నగేశ్ భీమపాక సీరియస్ అయ్యారు. ఈ తీర్పుతో అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకోవాలనే యత్నానికి హైకోర్టు చెక్ పెట్టినట్లయింది. ఇది అత్యంత భారీ జరిమానాగా న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది.