Telangana Junior Colleges : జూనియర్ కాలేజీలు నేడు రీఓపెన్

Update: 2024-06-01 04:52 GMT

వేసవి సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ కాలేజీలు నేడు రీఓపెన్ కానున్నాయి. TGలో మొత్తం 3,269 కాలేజీలు ఉండగా, నిన్నటి వరకు 2,483 కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. వీటిలో 1,443 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అయితే మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని ప్రైవేటు కాలేజీలపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా కాలేజీల్లోని సెకండియర్ విద్యార్థుల భవితవ్యంపై అయోమయం నెలకొంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 31 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 30 నాటికి మొదటి దశ ప్రవేశ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. మొదటి దశ ప్రవేశాలు పూర్తికాగానే.. రెండోదశ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.

Tags:    

Similar News