తెలంగాణకు ఐదు రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఆదిలాబాద్, కొమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఆగస్టు 17న వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లోను వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.